
న్యూఢిల్లీ: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) తిరుగుబాటు నేత శరద్ యాదవ్ నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ‘భారతీయ ట్రైబల్ పార్టీ’(బీటీపీ)ని ప్రారంభిస్తామని జేడీయూ శరద్ వర్గం ప్రధాన కార్యదర్శి అరుణ్ మీడియాకు తెలిపారు. బీటీపీ గుర్తుగా ‘ఆటో రిక్షా’ను ఎంపిక చేసుకుంటామన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన రాజశేఖరన్‌ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు.