
‘బిల్లుపై మా నిర్ణయాన్ని పార్లమెంటులో చెబుతాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో తమ పార్టీ నిర్ణయాన్ని పార్లమెంటులో వెల్లడిస్తామని జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ చెప్పారు. ఆయన శనివారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ చేసిన విభజన తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన నెలకొందన్నారు. బిల్లులోని అంశాలను, రాష్ట్రంలోని పరిస్థితులను చూసి ముందుకు వెళతామని ఆయన చెప్పారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు మూడు రోజులుగా పార్లమెంటు ఉభయ సభలను అడ్డుకోవడాన్ని శరద్ యాదవ్ తప్పుపట్టారు.