తుపాను ప్రభావంతో పలు రైళ్ల రద్దు | trains cancelled due to Vardah | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావంతో పలు రైళ్ల రద్దు

Published Tue, Dec 13 2016 9:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

తుపాను ప్రభావంతో పలు రైళ్ల రద్దు

తుపాను ప్రభావంతో పలు రైళ్ల రద్దు

హైదరాబాద్: వార్దా తుపాను ప్రభావం కారణంగా పెనుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దుచేసినట్లు మంగళవారం తెలిపింది. చెన్నై-లక్నో ఎక్స్‌ప్రెస్, చెన్నై-తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి- చెన్నై మద్రాస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళవారం రద్దు చేశారు.

అలాగే 14వతేదీ బుధవారం ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దుచేశారు. అదే రోజు ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రద్దుచేశారు. 15వ తేదీ గురువారం లక్నో-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు రద్దైంది. అలాగే పలు రైళ్లను దారిమళ్లించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement