వర్షాల కారణంగా పలు రైళ‍్ల రద్దు
వర్షాల కారణంగా పలు రైళ‍్ల రద్దు
Published Tue, Jul 18 2017 9:22 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
ఒడిశా: ఒడిశా, ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఒడిశాలోని సంబల్‌పూర్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగాపూర్-తెరువలి మార్గంలో వరద ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ఉండటంతో నాందేడ్-సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.
బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, ఈ నెల 20న తిరుపతి-బిలాస్‌పూర్, రాయగడ- జునాగఢ్ రోడ్ -రాయగడ మధ్య రైళ్ల సేవలు రద్దు చేశారు. తిరుపతి-బిలాస్‌పూర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. అలప్పుజా-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. హజ్రత్ నిజాముద్దీన్- విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ మీదుగా మళ్లింపు, విశాఖ- ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా దారి మళ్లించారు.
Advertisement
Advertisement