ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లోఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయాల్సివస్తే ఎంత రిఫండ్ వస్తుందోనని ఆందోళనపడుతుంటాం. టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎంత ఉంటాయోనని అనుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో టిక్కెట్ ఛార్జీలోని సగం మొత్తం అయినా రిఫండ్ రూపంలో మనకు అందదు.
బీహార్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రాహుల్ కుమార్‌కు ఫ్లయిట్ టిక్కెట్ రిఫండ్ విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. రాహుల్ కుమార్ రూ. 13,820కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుని, అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోగా, అతనికి రిఫండ్ రూపంలో కేవలం రూ. 20 చేతికి అందింది. అంటే రెండు కప్పుల చాయ్ పైసలు రిఫండ్ రూపంలో తిరిగి వచ్చాయి.
ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే..
ఐఎస్ అధికారి రాహుల్ కుమార్ ఫైట్ టిక్కెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. తాను విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న అనంతరం ఎయిర్‌లైన్స్.. ఫ్లైట్ క్యాన్సిలేషన్ రిఫండ్ ఆఫ్ టిక్కెట్‌ను ఆయనకు పంపింది. దానిలో టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ.11,800, జీఐ క్యాన్సిలేషన్ ఛార్జీ 1,200గా ఉంది. కన్వీనియన్స్ ఛార్జీలు రూ. 800. మొత్తంగా క్యాన్సిలేషన్ ఫీజు 13,800. ఫలితంగా రాహుల్ కుమార్‌కు రిఫండ్ రూపంలో కేవలం రూ.20 తిరిగి వచ్చాయి. దీనికి క్యాప్షన్‌గా ఆయన తనకు రిఫండ్ అయిన ఈ మొత్తంతో ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే తెలియజేయాలని వ్యంగ్యంగా కోరారు. రాహుల్ కుమార్ పోస్టుకు 5 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. 5 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq
— Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023
ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..
Comments
Please login to add a commentAdd a comment