ఉద్యోగులకు ఉరితాడుగా సీపీఎస్‌ | CPS System Cancel Employees Demands Prakasam | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఉరితాడుగా సీపీఎస్‌

Published Sat, Jul 21 2018 11:42 AM | Last Updated on Sat, Jul 21 2018 11:42 AM

CPS  System Cancel Employees Demands Prakasam - Sakshi

మాట్లాడుతున్న బాజీ పఠాన్‌

పెద్దదోర్నాల: సీపీఎస్‌ విధానం ఉద్యోగులకు ఉరితాడుగా మారిందని, ఈ విధానాన్ని రద్దు పరిచే వరకు ప్రతి ఒక్కరూ రాజీలేని పోరాటం చేయాలని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌ పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ భవన ప్రాంగణంలో ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌  విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థలో ఉన్న లక్షా 84 వేల మంది ఉద్యోగులను రక్షించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెట్టి వేస్తుందన్నారు. ఇలాంటి చర్యలను మానుకుని సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల లోపు ఈ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement