కేసులు ఎత్తి వేస్తేనే ఓటేస్తాం
Published Wed, Mar 15 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
– భూమా వర్గం మెలిక
నంద్యాల: తమపై కేసులు ఎత్తివేస్తేనే ఓటు వేస్తామని దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, కౌన్సిలర్ కృపాకర్ మెలిక పెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌పై బుధవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, అభ్యర్థి చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు సమావేశమయ్యారు. ఓట్ల విషయం ప్రస్థావనకు రాగా గంగిశెట్టి విజయ్‌కుమార్, శివశంకర్, మరికొందరు కౌన్సిలర్లు 2014లో భూమా నాగిరెడ్డితో పాటు తమపై పెట్టిన కేసుల గురించి సీరియస్‌గా మాట్లాడినట్లు తెలిసింది. భూమాతో పాటు తాము మానసిక క్షోభను అనుభవించామని, కేసులను ఉపసంహరిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తామని అన్నట్లు సమాచారం. కాని దీనిపై శిల్పా వర్గం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని తెలిసింది.
Advertisement
Advertisement