కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ నియా మక ప్రక్రియలో నిబంధనావళి ఉల్లంఘన ద్వారా ఉద్యోగాలు పొందిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
‘ఇంతటి అవినీతిని పశ్చిమబెంగాల్ లో ఏనాడూ చూడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు. ‘నాటి రాష్ట్ర ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, బోర్డ్ సభ్యులు ఈ నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చే శారు’ అని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు.
2016 నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే. ‘2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్ష ణ లేకుండా ఉద్యోగాలు పొందారు. అందుకే వీరి నియామకం మాత్రమే రద్ద యింది’ అని ఓ న్యాయవాది చెప్పారు.
చదవండి: కేరళలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో..
Comments
Please login to add a commentAdd a comment