
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తే వీటి అనుసంధానానికి 3 నుంచి 6 నెలల గడువిస్తామని కేంద్రానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ గడువు అనంతరం ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులన్నింటినీ రద్దు చేస్తామని మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 33 కోట్ల పాన్ కార్డులు ఉంటే..13.28 కోట్ల మంది తమ పాన్ కార్డుల్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment