- కొత్త టెండర్లు పిలిచిన కార్పొరేషన్
స్మార్ట్ సిటీ ‘పీఎంసీ’ టెండర్ల రద్దు
Published Wed, Nov 16 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
కాకినాడ :
వివాదానికి దారితీసిన కాకినాడ స్మార్ట్ సిటీ పనుల పర్యవేక్షణకు సంబంధించి గతంలో పిలిచిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ) టెండర్లను రద్దు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల క్రితం జరిగిన స్మార్ట్ సిటీ ఎవాల్యుయేష¯ŒS కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఆర్‌వీ అసోసియేట్స్‌కు టెండర్ ఖరారు కాగా, రెండో స్థానంలో నిలిచిన వాడియా సంస్థ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు పీఎంసీ నియామకంపై స్టే ఇచ్చింది.అనంతరం వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోర్టు ఆదేశించడంతో ఎవాల్యుయేష¯ŒS కమిటీ మూడు రోజుల క్రితం సమావేశమై ఇరువర్గాల వాదనలు, ఆయా సంస్థలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం స్మార్ట్ సిటీ ఎండీ, కమిషనర్ అలీమ్‌బాషా, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఇతర కమిటీ సభ్యులు ఈ అంశంపై చర్చించి చివరకు టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త టెండర్లను కూడా పిలిచారు. ఇందుకు సంబంధించి బుధవారం ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించి టెండర్ ప్రకటన కూడా ప్రచురితమైంది. దీంతో దాదాపు 4, 5 నెలలుగా స్తంభించిన పనులకు మళ్ళీ కదలిక వచ్చినట్లయింది.
Advertisement
Advertisement