
నిందితుడు శ్రీశైలం
బంజారాహిల్స్: ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఈ–చలానా ఓ బైక్ దొంగను పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడకు చెందిన కురుసం శేషు కొన్నాళ్ల క్రితం తన బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం బయటికి వచ్చి చూడగా బైక్ కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బాధితుడికి ట్రాఫిక్ పోలీసుల నుంచి వారం రోజుల్లో ఐదు ఈ–చలానాలు అందాయి. దీంతో అతను రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు వివరాలు అం దజేశాడు. పోలీసులు ఈ –చలానాలు పరిశీలించగా ఒక దాంట్లో బైక్ దొంగిలించిన వ్యక్తి ఫొటో స్పష్టంగా కనిపించింది. దీంతో క్రైం ఎస్‌ఐ శంకర్ శ్రీకృష్ణానగర్‌లో విచారణ చేపట్టారు. ఓ పాన్‌డబ్బా వ్యాపారి సదరు వ్యక్తిని తాను చాలాసార్లు చూశానని లేబర్‌గా పని చేస్తాడని చెబుతూ కృష్ణానగర్‌లో అతడి ఇంటిని చూపించాడు. పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లి నిందితుడు శ్రీశైలంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో సోమవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment