
ఐపీఎస్ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

.

.

.

జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు.

.

.

అయితే ఐపీఎస్ అధికారి కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారని ఆరోపణ.

.

.

.డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటివి చేశారు.

.

.

ఇదే క్రమంలో ఈ నెల 14న డీసీపీ వాహనాన్ని డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించినట్టు తెలిసింది.

.

ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్, ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

.

ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు.

.

అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది.

.

ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకొచ్చింది. హీరోయిన్ డింపుల్ హయాతి కారుకు పోలీసులు వరుసగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

.

డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హీరోయిన్ డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు.

డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని రోడ్డు మీద సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఇదే విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో తాము లీగల్‌గానే పోరాటం చేస్తామని వెల్లడించారు.