మీరట్ : ఒక వ్యక్తి తాను హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేయడంతో బైక్‌ను కిందపడేసి నానా రభస చేసిన ఘటన శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ఒక వ్యక్తి బైక్‌పై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ధరించనందుకు చలాన్ వేస్తున్నట్లు అతనికి తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా తన బైక్‌ను కింద పడేసి రోడ్డుపై రెండు సార్లు అటూ ఇటూ దొర్లించి తర్వాత అదే బైక్‌పై కూర్చొని ఏడ్వడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. అతని వింత ప్రవర్తన అర్థంగాక పోలీసులు ఆ వ్యక్తిని సముదాయించేందుకు ప్రయత్నించారు. కాగా మొత్తం 43 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోనూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ' పోలీసులు చలాన్ వేస్తే కడితే కట్టాలి లేకపోతే లేదు కానీ ఇలా చేయడం ఏంటని' కామెంట్లు పెడుతున్నారు.
Agitated over traffic challan, a biker in UP's Meerut took out his anger on his motorcycle. He later sat on the fallen bike and started crying as traffic cops stood and watched the entire drama unfolding on a busy street in the city. @Uppolice pic.twitter.com/lZ8TfQYUWt
— Piyush Rai (@Benarasiyaa) November 25, 2019
Comments
Please login to add a commentAdd a comment