
ఫైన్‌ల మీద ఫైన్‌లు
లబోదిబోమంటున్న అసలు యజమాని
సిరిసిల్లక్రైం: తాను రోడ్డు నిబంధనలు అతిక్రమించకుండానే తన ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో కంగుతిన్నాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తి. తన బైక్ నంబర్‌ను మరో వాహనదారుడు తన బండికి వేసుకొని ఇష్టారీతిగా తిరుగుతుండడంతో జరిమానాల మీద జరిమానాలు వచ్చి పడుతుండడంతో అసలు యజమాని లబోదిబోమంటున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోబిన్ తన వాహనాన్ని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. శనివారం తన బైక్ నిబంధనలు అతిక్రమించినట్లు ట్రాఫిక్ చలాన్ వచ్చింది.
దీన్ని ఓపెన్ చేసి చూడగా తంగళ్లపల్లి మండలం తాడూరు ఎక్స్ రోడ్ వద్ద హెల్మెట్ లేకపోవడంతో చలాన్ విధించినట్లు మెసేజ్ ఉంది. అసలు తాను అక్కడికి వెళ్లలేదని తన వాహనం పల్సర్ 150 సీసీ కాగా.. చలాన్ వచ్చిన వాహనం పల్సర్ 220 సీసీ అని పేర్కొన్నారు. పోకిరీలు కావాలని తన బైక్ నంబర్‌ను వారి వాహనానికి బిగించుకొని జిల్లాలో తిరుగుతున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment