అలర్ట్‌: నేటి అర్ధరాత్రితో ముగియనున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు | discount on traffic challans Validity Ends Today February 15th | Sakshi
Sakshi News home page

అలర్ట్‌: నేటి అర్ధరాత్రితో ముగియనున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు

Published Thu, Feb 15 2024 8:54 PM | Last Updated on Thu, Feb 15 2024 9:17 PM

discount on traffic challans Validity Ends Today February 15th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వాహనాల పెండింగ్‌ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. రాత్రి 11.59 గంటలకు డిస్కౌంట్‌ ఆఫర్‌ గడువు ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే.

మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించగా.. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు కోటి 66 లక్షల పెండింగ్‌ చలాన్ల క్లియరెన్స్‌తో రూ.147 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటిరకు కోటి 66 లక్షల కేసులు క్లియర్ అయినట్లు పేర్కొన్నారు. 47 శాతం కేసులు క్లియర్‌ కాగా.. ఇంకా 53 శాతం పెండింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 
చదవండి: శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement