
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment