TS Police Constable
-
TS: కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి.. సీఎం రేవంత్ విచారం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
కానిస్టేబుల్‌కు అభినందన
ఆసిఫాబాద్‌అర్బన్: ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ గోపిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో ఎస్పీ సురేశ్‌కుమార్ ప్ర త్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ స్పె షల్ పార్టీ విభాగానికి చెందిన పొట్ట గోపి పంజాబ్‌లో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండి యా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సెపక్ టక్ర క్రీడలో పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సా ధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడ్మిన్ ఆర్ఐ పెద్దన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యో మహేషా.. ఎంత పనైంది బిడ్డా!
సాక్షి, హైదరాబాద్: పాపం.. ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సర్కారీ కొలువు కొట్టాలన్న కసి.. అతని ప్రాణం తీసింది. శనివారం నగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో విషాదం నెలకొంది. కానిస్టేబుల్స్ ఈవెంట్స్‌లో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు మహేష్ అనే అభ్యర్థి. వెంటనే అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ కన్నుమూశాడు. దీంతో.. అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలన్న కల.. కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్న అతని లక్ష్యం రెండూ నెరవేరకుండానే అతని జీవితం అర్థాంతంరంగా ముగిసింది. -
వారం ముందే ముగియనున్న కానిస్టేబుళ్ల శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న కానిస్టేబుల్ శిక్షణ గడువుకు వారం ముందే ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ అక్టోబర్ 12 తరువాత పూర్తవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా మొదటి సెమిస్టర్ అనంతరం ఇవ్వాల్సిన వారం రోజుల సెలవులు రద్దయ్యాయి. మర్నాటి నుంచే రెండో సెమిస్టర్ ప్రారంభమవడంతో తొమ్మిది నెలల కానిస్టేబుల్ శిక్షణ ఈసారి వారం ముందే పూర్తవుతోంది. ఇదే విషయాన్ని సాక్షి జూన్ 26 నాటి సంచికలో వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి 7వ తేదీ మధ్య పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ), అంబర్‌పేట, గోషామహల్, మేడ్చల్ యూనిట్లతోపాటు జిల్లాలకు చెందిన అన్ని పీటీసీ, డీటీసీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలందాయి. కరోనా కారణంగా.. జనవరి 17న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12వేలమంది సివిల్, ఏఆర్ తదితర విభాగాల కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. అంతలో కరోనా, లాక్డౌన్ పరిణామాలతో ముందుజాగ్రత్తగా అధికారులు కేడెట్లను బయటకు అనుమతించలేదు. మార్చి 25 నుంచి ఇప్పటిదాకా అంటే 130 రోజులకుపైగా వీరందరినీ టీఎస్పీఏపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. కేడెట్లకు ఔటింగ్ ఇవ్వకపోగా వారిని చూసేందుకు వచ్చే తల్లిదండ్రులు, భార్యాపిల్లలను అనుమతించట్లేదు. చివరిసారిగా కానిస్టేబుల్ కేడెట్లకు మార్చి 8, 9 తేదీల్లో సెలవులిచ్చారు. తరువాత లాక్‌డౌన్‌తో ఇవన్నీ రద్దయ్యాయి. మే 4,5,6,7 తేదీల్లో తొలి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వాలి. కానీ, కరోనా దృష్ట్యా రద్దు చేసి, మే 8 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించారు. దీంతో కోర్సు వారం ముందే పూర్తికానుంది. టీఎస్ఎస్పీ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశలు వాస్తవానికి ప్రస్తుత కానిస్టేబుల్ అభ్యర్థులతోపాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) అభ్యర్థులకూ శిక్షణ ప్రారంభించాలి. ఈసారి భారీగా పోలీసు కానిస్టేబుళ్లను భర్తీ చేయడంతో రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో ఖాళీ లేకుండా పోయింది. దీంతో దాదాపు 4,200 మంది టీఎస్ఎస్పీ కేడెట్లను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని భావించినా, సాంకేతిక కారణాలతో వీలుపడలేదు. ఈ క్రమంలో సివిల్, ఏఆర్ అభ్యర్థుల పాసింగ్ ఔట్ పరేడ్ తేదీలు ప్రకటించడంతో టీఎస్ఎస్పీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే వీరి శిక్షణ తేదీలు ప్రకటించే అవకాశాలున్నాయి. నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో అడిషనల్ ఎస్పీలు (నాన్‌కేడర్)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్ డీసీపీ (ఆపరేషన్స్)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్‌లో అడిషనల్ డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. -
కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : నాలుగైదు నెలలుగా కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తుది ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) మంగళవారం రాత్రి 11 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను https://www. tslprb.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన రాతపరీక్షలో 90 వేలమంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో సివిల్, ఏఆర్, టీఎస్ ఎస్పీ, ఫైర్, ప్రిజన్స్, డ్రైవర్స్ తదితర విభాగాల ఫలితాలకు కలిపి మొత్తంగా 17,156 మంది ఎంపికైనట్లు టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో 13,373 మంది పురుషులు కాగా 2,652 మంది మహిళలున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఏమైనా అభ్యంతరాలుంటే.. ఈనెల 25 (నేడు) 4 గంటల నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు స్థానిక ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.1,000 ఇతరులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుం దన్నారు. మరిన్ని వివరాలకు https://www. tslprb.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు..17,156 పురుషులు.. 13,373 మహిళలు.. 2,652 -
ఫలితాల వెల్లడి
టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ టీఎస్ పదో తరగతి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంబీఏ(హెచ్ఏ), కంప్యూటర్ సైన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ- నవంబర్ 2015 పీజీ మూడో సెమిస్టర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్-1 ఫిబ్రవరి 2016