
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పాపం.. ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సర్కారీ కొలువు కొట్టాలన్న కసి.. అతని ప్రాణం తీసింది. శనివారం నగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో విషాదం నెలకొంది.
కానిస్టేబుల్స్ ఈవెంట్స్‌లో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు మహేష్ అనే అభ్యర్థి. వెంటనే అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ కన్నుమూశాడు. దీంతో..
అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలన్న కల.. కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్న అతని లక్ష్యం రెండూ నెరవేరకుండానే అతని జీవితం అర్థాంతంరంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment