Osmania hosptial
-
అయ్యో మహేషా.. ఎంత పనైంది బిడ్డా!
సాక్షి, హైదరాబాద్: పాపం.. ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సర్కారీ కొలువు కొట్టాలన్న కసి.. అతని ప్రాణం తీసింది. శనివారం నగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో విషాదం నెలకొంది. కానిస్టేబుల్స్ ఈవెంట్స్‌లో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు మహేష్ అనే అభ్యర్థి. వెంటనే అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ కన్నుమూశాడు. దీంతో.. అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలన్న కల.. కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్న అతని లక్ష్యం రెండూ నెరవేరకుండానే అతని జీవితం అర్థాంతంరంగా ముగిసింది. -
ఉస్మానియాలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌పేషెంట్ బ్లాకు, ఆర్ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. (చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!) -
గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలింది. గాంధీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్ సర్జన్స్ కోవిడ్ బారిన పడ్డారు. అదే విధంగా ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా తెలంగాణలో సోమవారం 1,825 కోవిడ్ కేసులు నమోదయయాయి. ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855, మరణాల సంఖ్య 4,043కి చేరింది. ప్రస్తుతం 14, 995 యాక్టివ్ కేసులున్నాయి. చదవండి: కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్ చదవండి: సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ -
పెద్ద పెద్ద గదులు.. చిన్న సమస్యలతో మచ్చ!
పేదోడికి జబ్బు చేస్తే.. చూసేది సర్కారీ దవాఖానావైపే.. దేవుడి లెక్క చేతులెత్తి దండం పెట్టేది.. ఆ డాక్టరు బాబుకే.. ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే పెద్ద పెద్ద భవనాలు.. పెద్ద పెద్ద గదులు.. కదా.. అయితే.. అక్కడుండే చిన్నచిన్న సమస్యలు.. అంతోటి పెద్ద పెద్ద ఆస్పత్రుల ప్రతిష్టకు మచ్చను తెచ్చిపెడుతున్నాయి.. వైద్యం కోసం వెళ్తే సామాన్యులకు కష్టాలను ‘కొని’ తెచ్చిపెడుతున్నాయి. ఒకచోట డాక్టర్ బాబు సరిగా రారు.. మరోచోట పరీక్షలు చేసే పరికరాలు పనిచేయవు.. ఇంకోచోట దూదికీ దిక్కులేదు.. కొద్దిపాటి నిధులు కేటాయించి.. కాస్త దృష్టిపెడితే.. సరిదిద్దగలిగే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఎన్నో.. ఈ కొత్త ఏడాదిలో దానిపై దృష్టి పెడితే.. ప్రభుత్వ దవాఖానా ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం.. ఆ సమస్యలు వాటి వివరాలు ఏంటో ఓసారి చూద్దామా.. – సాక్షి, హైదరాబాద్ సూది మందు వేయాలి.. శ్రద్ధ కాస్తపెట్టాలి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్ఐ మిషన్ కూడా పనిచేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్ఐ మిషన్ కూడా పని చేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉస్మానియాలో పనిచేయని సీటీ స్కాన్ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో రెండు సీటీ స్కాన్లు ఉండగా, ఒకటి మరమ్మతుల్లో ఉంది. ఐసీయూల్లో ఉండే మల్టీ చానల్ మానిటర్లు పనిచేయడంలేదు. సీటీ స్కాన్‌ను మరమ్మతు చేయడానికి రూ.10 వేలు, మల్టీచానల్ మానిటర్ల కోసం రూ.లక్ష వరకు కేటాయిస్తే అవి అందుబాటులోకి వచ్చే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్తవి కొనుగోలు చేసినా రూ. 2 కోట్లు ఖర్చుచేస్తే సరి. జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద పరీక్షలకు దిక్కేది రాష్ట్రంలో అనేక జిల్లా ఆసుపత్రుల్లో కీలకమైన సీటీ స్కాన్, అ్రల్టాసౌండ్, 2డీ ఎకో వంటి వైద్య పరికరాలు అందుబాటులో లేవు. దీంతో ఆయా ఆసుపత్రులకు వచ్చే పేదరోగులు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ లేబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కో ఆసుపత్రి రూ.3 కోట్ల మేర ఖర్చు చేసినా వీటిని సమకూర్చుకోవచ్చు. 46 కొత్త ఆసుపత్రులు నిర్మించినా? రాష్ట్రంలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) నిర్మించారు. వాటిని నిర్మించి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ, చిన్న, చిన్న పనులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఆయా కొత్త ఆసుపత్రులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఒక్కో ఆసుపత్రికి సరాసరి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.2.30 కోట్లు ఖర్చు చేస్తే ఇవి పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి. మూడు నెలల మందులు వారానికే.. పీహెచ్సీ, సీహెచ్‌సీ మొదలు జిల్లాస్థాయి ఆసుపత్రులు, ఆపై ఆసుపత్రుల వరకు చాలా చోట్ల రోగులకు సరిపడా మందులు ఇవ్వడంలేదు. బీపీ, షుగర్, ఆస్తమా, పక్షవాతం, కీళ్ల నొప్పులు తదితర రోగాలకు నిత్యం వాడాల్సిన మందులను వారానికే ఇస్తున్నారు. వారం తర్వాత ఆయా మందులను రోగులు బయట కొంటున్నారు. నెల నుంచి మూడు నెలల వరకు మందులు ఇస్తే ఎటువంటి సమస్యా తలెత్తదు. ఆ మేరకు మందులను సర్దుబాటు చేయాలి. దీనికి బడ్జెట్‌తో సంబంధంలేదు. ఇలా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పీహెచ్‌సీలు, ఇతర కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. రోజూ డాక్టర్ వస్తారన్న నమ్మకం కల్పిస్తే చాలు రోగులు ఓపీలో చూపించుకుంటారు. దీనికి కావాల్సింది పర్యవేక్షణ అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఏళ్లు, నెలల తరబడి మూలనపడి ఉంటున్నాయి. దాదాపు 20 శాతం వరకు మరమ్మతుల్లో ఉన్నాయి. వాటిని మరమ్మతు చేస్తే రోగులకు ఎంతో ప్రయోజనం. అందుకోసం కొన్ని ఆసుపత్రులకు కలిపి టెక్నీíÙయన్లను నియమించుకోవాలి. వాటికయ్యే ఖర్చు అత్యంత స్వల్పం అనేక ఆసుపత్రుల ప్రాంగణాల్లో పిచి్చమొక్కలు దర్మనమిస్తున్నాయి. మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో వాటిని తొలగించి ఉద్యాన శాఖ ద్వారా మంచి మొక్కలు పెంచితే ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేషెంట్ కేర్ ప్రొవైడర్లు ఉండాలి. పరీక్షలు ఎక్కడ చేస్తారు? ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారో తెలియజెప్పాలి. రిసెప్షన్ సెంటర్ ఉండాలి. తద్వారా రోగులకు గైడ్ చేయాలి. డాక్టర్లు చూసి మందులు రాసి వెళ్తారు. కానీ, రోగికి వచి్చన జబ్బుపై చర్చించి అవసరమైన సలహాలు ఇవ్వరు. ఈ పరిస్థితి మారాలి. -
వరదనీరు ఆసుపత్రిలో చేరకుండా చర్యలు తీసుకోండి
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్న పిల్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆస్పత్రిలో నీరు నిండుతొందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని హైకోర్టు ప్రస్తావించింది. మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది. (‘హైదరాబాద్‌లో అత్యధిక వర్షం, ఇది రెండోసారి’ ) -
ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి పురాతన కట్టడం కావడంతో పక్కన ఉన్న స్థలంలో నూతన భవనం నిర్మించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత, నూతన నిర్మాణంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆస్పత్రి గూగుల్ మ్యాప్, ప్లాట్ లే అవుట్ కాపీలను అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించి వాదనలు వినిప్తామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ హైకోర్టు పేర్కొంది. (కోవిడ్ పరీక్షలపై కౌంటర్ దాఖలకు ఆదేశం) అదే విధంగా పింఛనర్ల పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పింఛనర్ల పిటిషన్‌పై ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసెంబ్లీ సమావేశాలోపు పింఛనర్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని వెల్లడించింది. లేని పక్షంలో తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 1కు వాయిదా వేసింది. -
ఉస్మానియా కూల్చివేతపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా పురాతన కట్టడం అని దానిని కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని, దానిని తొలగించి నూతన భవనం నిర్మిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. కొత్త నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఎర్రమంజిల్ భవనంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిషనర్లు ఈ తీర్పు ఉస్మానియాకు కూడా వర్తిస్తుందని వాదించారు. పురాతన కట్టడాన్ని కూల్చివేయకుండా పక్కన ఉన్న16 ఎకరాల స్థలంలో నూతన నిర్మాణం చేపట్టాల్సిందిగా పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి సైట్‌కి సంబంధించిన మొత్తం గూగుల్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి హైకోర్టు వాయిదా వేసింది. (‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’) -
అన్నింటిని కలిపి విచారిస్తాం: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి అనేక మంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలు చేశారని, వాటన్నింటిని కలిపి విచారిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సోమవారం హైకోర్టులో ఉస్మానియా ఆస్పత్రి అంశంపై విచారించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని, రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని కోర్టుకు వివరించారు. (చదవండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు) పురావస్తు భవనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని ఓ పిటిషర్ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని వ్యతిరేకించిన మరో కౌన్సిల్ సందీప్‌రెడ్డి.. ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్‌కు తెలిపారు. వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూశామని చీఫ్ జస్టిస్ అన్నారు. ఉస్మానియా అస్పత్రి అంశంపై దాఖలైన వ్యాజ్యాలలో కొన్ని పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని, వాటిని విభజించి విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 24కు వాయిదా వేశారు. -
ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో కావాల్సినన్ని గ్లూకోజ్ స్టాండ్లు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు గ్లూకోజ్ స్టాండ్‌కి బదులు బెడ్స్ కర్ర సహాయంతో సెలైన్ బాటిల్స్‌ను ఎక్కించుకుంటున్నారు. ఈ దయనీమైన పరిస్ధితి గురించి మీడియాకి సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులకు గ్లూకోజ్ స్టాండ్లు తెప్పించారు. -
ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది
సాక్షి, ఉస్మానియా ఆస్పత్రి : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంటే ప్రభుత్వం చేతులెత్తేసిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు ఉస్మా నియా ఆస్పత్రి వర్షపు నీటిలో మునిగిపోవ టమే నిదర్శనమన్నారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియా ఆస్పత్రిని తెలంగాణ వచ్చాక వరద నీటితో నింపటమే టీఆర్ఎస్ సర్కారు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. బుధవారం కురిసిన భారీ వర్షంతో ఆస్పత్రి వార్డుల్లోకి నీళ్లు చేరిన విష యం తెలిసిందే. రెండోరోజు కూడా ఆస్పత్రిలో ఇబ్బందులు తప్పలేదు. వర్షపు నీటిలో ఉన్న పడకలను ఇతర గదులకు మార్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉత్తమ్ ఆధ్వర్యంలోని బృందం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిం చింది. నీట మునిగిన వార్డులను పరిశీలించింది. రోగులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఖరి వల్లే హైదరాబాద్ నగరం కరోనాతో విలవిల్లాడుతోందని ఆరోపించారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా పరీక్షలు నిర్వహించట్లేదని, పాజిటివ్ కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం స్వల్పంగా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌కు ఏ అధికారం లేదని, ఆయనను కేవలం రబ్బర్‌స్టాంప్‌గా వాడుకుంటున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణేదీ? రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఫీజుల మోతతో పాటు పేదలు వెళ్తే బెడ్లు ఇవ్వని పరిస్థితి ఉందని, ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని ఉత్తమ్ అన్నారు. ఇక వాన నీటిలో మునిగిన పడకలతో ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలను వదిలేసి ఫాంహౌస్‌లో కాలయాపన చేస్తుండటం దురదృష్టకరమన్నారు. అసమర్థత, ముందుచూపు లేకపోవటం వల్లే హైదరాబాద్ గజగజలాడుతోందన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి బదులు సీఎం తన మూఢనమ్మకాలతో సెక్రటేరియట్ కూలగొడుతుండటం దారుణమన్నారు. ఇందుకోసం వెచ్చించే నిధులను వెంటనే ఉస్మానియా ఆస్పత్రి బాగుకు కేటాయించాలని ఉత్తమ్ కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, నాయకులు ఫిరోజ్‌ఖాన్, గౌస్ తదితరులున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో చేరండి : బండి సంజయ్ వర్షపు నీరు ముంచెత్తిన ఉస్మానియా ఆస్పత్రిని గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. పీపీఈ కిట్ ధరించిన ఆయన ఆస్పత్రిలోని అన్ని ప్రాంతాలు పరిశీలించారు. తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉస్మానియా ఆసుపత్రిలో పేదలకు సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి కనీస వసతులు లేవు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు?. ఆయుష్మాన్ భారత్ అమలు చేయట్లేదు. కరోనా నియంత్రణలో సీఎం పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా వైఫల్యాన్ని ఒప్పుకుని ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలి. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంపై కోర్టులో కేసు ఉందని ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. మరి సచివాలయం విషయంలో కోర్టు కేసు లేదా?. ప్రస్తుతం అవసరం లేని సెక్రటేరియట్ కూల్చివేత, నిర్మాణాలు ఆపి ఉస్మానియా ఆస్పత్రిని ఆధునీకరించాలి’ అని సంజయ్ అన్నారు. ఆయన వెంట ఎంఎల్సీ రాంచందర్‌రావు, ఎంఎల్ఏ రాజాసింగ్ ఉన్నారు. కొత్త భవనం నిర్మించండి: చెరుకు సీఎం కేసీఆర్‌కు సచివాలయం కూల్చివేయడంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆస్పత్రిపై లేదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. గురువారం ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమైఖ్య రాష్ట్రంలో విడుదల చేసిన రూ.200 కోట్లను ఇప్పటికీ వినియోగించుకోలేదన్నారు. కేసీఆర్ వెంటనే ఆస్పత్రిని సందర్శించి కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు మీరు చేసిందేమిటి: తలసాని పాత ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి కొత్త భవనం కట్టేందుకు ముఖ్యమంత్రి నిర్ణయిస్తే..హెరిటేజ్ భవనం ఎలా కూలుస్తారంటూ అడ్డుకున్నది కాంగ్రెస్, బీజేపీలేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి రోగులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారని గుర్తుచేశారు. మొత్తం 11 బ్లాకుల్లో 8 బ్లాక్‌ల పరిస్థితి అధ్వానంగా మారినట్టు అధికారులిచ్చిన నివేదిక మేరకు కొత్త ఆస్పత్రి నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం హెరిటేజ్ జాబితాలో ఉందని, కూల్చివేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించారని తలసాని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ్, వీహెచ్‌లు అడ్డుకున్న వీడియోలను మంత్రి తలసాని ప్రదర్శించారు. -
ముంపులో ఉస్మానియా ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగు నీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాతభవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా కారిడార్ మేల్ వార్డులు ఉస్మాన్సాగర్ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్తడంతో వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లు మాత్రమే కాదు..వారికి చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం బెంబేలెత్తిపోయారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. తరచూ పైకప్పులు పెచ్చులూడిపడుతుండటం, శ్లాబ్ సహా గోడలకు పగుళ్లు ఏర్పడటంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు కిందికి ఇంకుతుంది. అటకెక్కిన కొత్త భవనాల హామీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించి, వారం రోజుల్లో రోగులను ఖాళీ చేయించి, పాతభవనం స్థానంలో అత్యాధునిక రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఆస్పత్రి నిర్మాణ ప్రస్తావనను కూడా పూర్తిగా విస్మరించడంతో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అటకెక్కింది. మురుగు నీటి వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో వర్షానికి ఆస్పత్రి ఆవరణలోని పలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటికి మురుగు నీరు తోడై..వార్డులను ముంచెత్తడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంతమంది రోగులు వరద నీటికి పరుపులను అడ్డుపెట్టి..నీటిని బయటికి తోడేశారు. మరికొంత మంది పడకల కింద నీరు చేరినప్పటికీ..విధిలేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోయారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు రోగుల వద్దకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. -
స్క్రాప్ గోదాంలో పేలుడు
సాక్షి, రాజేంద్రనగర్: కెమికల్ డబ్బాల పేలుడుతో సీఐ, ఎస్సైతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి.. శాస్త్రీపురంలో యాకత్పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిద్ స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కెమికల్ డబ్బాలను సేకరించి ఈ గోదాంలో శుభ్రపరుస్తుంటారు. శుభ్రపరిచిన ఈ డబ్బాలను తిరిగి విక్రయిస్తారు. 5, 10, 20, 25 లీటర్ల డబ్బాలతో పాటు ప్లాస్టిక్ డ్రమ్ములను శుభ్రపరిచి విక్రయించడం ఇతడి వ్యాపారం. ఇందులో పది మంది యువకులు పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక కెమికల్ డబ్బా పెలింది. ఈ సంఘటనలో హసన్‌నగర్‌కు చెందిన అప్రోజ్(25)కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు మోకాళ్ల వరకు నుజ్జునుజ్జయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే యజమాని పారిపోయాడు. స్థానికులు, తోటి కార్మికులు అప్రోజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో అప్రోజ్ కాలును శాస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ విషయమై స్థానికులలు ఎంఐఎం నాయకుడు రహమత్‌బేగ్, శాస్త్రీపురం కార్పొరేటర్ మిస్బావుద్దీన్లకు సమాచారం అందించారు. స్థానికులంతా కలిసి గోదాం ఎదుట గురువారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కార్పొరేటర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ సత్తయ్యగౌడ్, ఎస్సై నదీమ్ సిబ్బందితో గోదాం వద్దకు చేరుకుని లోపల పరిశీలిస్తుండగా ఆ సమయంలో మరో కెమికల్ డబ్బా పేలింది. దీంతో సీఐ, ఎస్సై, కార్పొరేటర్‌తో పాటు రహమత్‌బేగ్, సయ్యద్ హబీబ్లకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే అపోలోతో పాటు అస్రా ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ ఆశోకచక్రవర్తి పరిశీలించారు. గోదాంను సీజ్ చేశారు. కాగా, గోదాం పరిశీలించేందుకు వెళ్లిన సీఐతో పాటు నలుగురి కర్ణబేరీలకు దెబ్బతిన్నాయి. వారికి వినికిడి శక్తి తగ్గిపోయినట్టు తెలిసింది. గోదాములను తొలగించాలి శాస్త్రీపురంలో పలు గోదాంలు అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దాదాపు 25కు పైగా గోదాములు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధాన రహదారిపైనే భారీ ప్లాస్టిక్ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, అనుకోని ప్రమాదం జరిగితే చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు నష్టం వాట్టిల్లే ప్రమాదం ఉందన్నారు. -
రెండు నెలల్లో రెండుసార్లు..
సుల్తాన్‌బజార్: రాష్ట్రంలోనే పేరొందిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో డయాలసిస్ కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లిఫ్ట్ వాడకంలోకి వచ్చిన రెండు నెలల గడవక ముందే రెండోసారి మరమ్మతుకు గురికావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది రోగులకు చికిత్సలు అందించే యురాలజీ, డిమిడ్ విభాగాలు ఆపరేషన్ థియేటర్లు ఉన్న భవనంలో లిఫ్ట్ పని చేయకపోవడంతో డయాలసిస్ సెంటర్‌కు వెళ్లేందుకు రోగులు గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో అంతస్తు వరకు ఇటీవల మరో లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే రెండు నెలలు గడవక ముందే లిప్ట్ మరమ్మతులకు గురికావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. రెండో అంతస్తు వరకు కిడ్నీ వ్యా«ధిగ్రస్తులకు లిఫ్ట్‌లో తీసుకువెళ్లి అక్కడి నుంచి మూడో అంతస్తుకు వీల్‌ఛైర్‌లో తరలిస్తుండడంతో రోగులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తదైనా ఇబ్బందులే.. ఉస్మానియా క్యూక్యూడీసీ భవనంలోని 3వ అంతస్తుకు రోగులను తీసుకువెళ్లేందుకుగాను 2017 జనవరిలో మరో లిఫ్ట్ ఏర్పాటుకు టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ శ్రీకారం చుట్టింది. దాదాపు రూ. 30లక్షలతో లిఫ్ట్ నిర్మాణ పనులు ప్రారంభించగా, కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ దాదాపు ఏడాదిన్నరపాటు పనులను సాగదీసింది. గత నవంబర్ 12న పనులు పూర్తికావడంతో డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. ప్రారంభమైన రెండునెలల్లోనే రెండోసారి మరమ్మతుకు గురికావడం అధికారుల టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ పనితీరును చెప్పకనే చెబుతుంది. టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ ఎలక్ట్రికల్ విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నాసిరకంగా జరగడంతోనే రెండు నెలలకే లిప్ట్ పనిచేయకుండా పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ లిప్ట్ రెండునెలల్లో రెండు సార్లు రిపేరీ కావడం పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా లిప్ట్ను బాగుచేసి డయాలసిస్ రోగులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో.. ఆ ఒక్కటీ అడక్కు..!
కానరాని పారిశుద్ధ్యం ప్రధాన ఆస్పత్రుల వార్డుల్లో దుర్వాసన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లోనూ అదేతీరు రూ.కోట్లు వెచ్చించినా మెరుగు పడని పరిస్థితి సిటీబ్యూరో: రోగమొచ్చి ప్రభుత్వాస్పత్రికి వస్తే.. కొత్త రోగాలు అంటుతున్నాయి. ప్రధాన గేటు నుంచి మొదలయ్యే దుర్వాసన ప్రధాన వార్డుల్లోనూ వదలడం లేదు. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరెంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో ఉస్మానియా, గాంధీ సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్టీ, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోని వార్డుల్లో దుర్వాసనకు రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు వ్యర్థాల్లో మురిగిపోతున్నాయి. బుధవారం పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. అక్కడి పరిస్థితితులు దారుణంగా కనిపించాయి. నిలోఫర్.. చిన్నారులకు డర్.. రాష్ట్రలోనే అతిపెద్ద చిన్నపిల్లల ఆస్పత్రిగా ‘నిలోఫర్’కు గుర్తింపు ఉంది. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. కానీ ఈ ఆస్పత్రిలో ఆ జాగ్రత్తలు మచ్చుకు కూడా కానరావు. నిలోఫర్‌లో పారిశుద్ధ్య నిర్వాహణకు ప్రభుత్వం నెలకు రూ.8.38 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాలి. కానీ ఇక్కడ అసలు ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి చేతులు కడిగేసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి వెలువడుతున్న బయె ూమెడికల్ వ్యర్థాలను వేరు చేయకుండా సిబ్బంది అన్నింటినీ ఒకే మూటలో కట్టేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని బయటికి తరలించాల్సింది పోయి క్యాంటీన్ సమీపంలోని ఖాళీ స్థలంలో పోగేస్తున్నారు. వీటి మూలంగా చిన్నపిల్లలకు బాక్టీరియా, ఇతర వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్టు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం శుభ్రత ఇలా ఉండాలి.. ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. ఓపీని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ ధియేటర్లను ఐదుసార్లు శుభ్రపరచాలి.ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్ల చొప్పున శుభ్రపరచాలి.{పతి 15 రోజులకోసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి.నెలకోసారి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలి. దీన్ని శానిటేషన్ ఏజెన్సీలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే తప్ప కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఉస్మానియాలో అవినీతి ‘కంపు’ కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ‘ఉస్మానియా’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.29 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ 270 మందికి 200 మందికి మించి కార్మికులు లేరు. దీంతో ఓపీతో పాటు ఇన్ పేషంట్ వార్డుల్లో చెత్త పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వె దజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఎన్ఐసీయూ పక్కనే టాయిలెట్లు పొంగుతున్నాయి. వార్డుకు సమీపంలోనే మూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ పరిసరాలు దారుణంగా ఉన్నాయి. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీ కుతుబ్‌షా భవనంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయక పోవడంతో నీరు తాగిన రోగులు కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. సిరెంజ్లు, బ్లేడ్స్ వంటి క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. మారని ‘గాంధీ’ తీరు.. గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు ప్రభుత్వం నెలకు రూ. 23.7 లక్షలు ఖర్చు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి వ్యర్థాలను తొలగించక పోవడంతో వార్డులు చెత్త కూపాలుగా మారిపోయాయి. ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వాహణ దారుణంగా ఉంది. ఆస్పత్రి ఆవరణలో క్లినికల్ ప్లాంట్ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. లేబర్ రూమ్‌తో పాటు పలు వార్డుల్లోని పారి శుద్ధ్య నిర్వాహణ అత్యంత అద్వానంగా మారింది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సైతం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తూ గవర్నర్ హెచ్చరించినా ఆస్పత్రిలోని పారిశుద్ధ్య నిర్వహణ తీరు మాత్రం మారకపోవడం గమనార్హం. ‘పేట్లబురుజు’లో నిర్లక్ష్యం.. బహదూర్‌పురా: పేట్లబురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆస్పత్రిని లేబర్ రూంలో పారిశుద్ధ్యం అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. ఆవరణలోని క్యాంటీన్ బయట డ్రైనేజీ మురుగునీరు నిలిచిపోతున్నా సరిచేసే దిక్కులేదు. రోగులకు ఆహారం సరఫరా చేసే క్యాంటీన్లోనూ అపరిశుభ్రత తాండవిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో 69 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల ప్రభుత్వం రూ. 15 లక్షల నిధులను ఆల్ గ్లోబల్ సర్వీసు సంస్థ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఆసుపత్రి వ్యర్థాలు, చెత్తను తొలగించడం, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడంలో కాంట్రాక్టర్ అసలు పట్టించుకోవడం లేదు. తక్కువ సిబ్బందితో పని కానిచ్చేస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, వారి సహాయకులు అపరిశుభ్ర వాతావరణంతో రోగాల బారిన పడుతున్నారు.