పేదోడికి జబ్బు చేస్తే.. చూసేది సర్కారీ దవాఖానావైపే.. దేవుడి లెక్క చేతులెత్తి దండం పెట్టేది.. ఆ డాక్టరు బాబుకే.. ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే పెద్ద పెద్ద భవనాలు.. పెద్ద పెద్ద గదులు.. కదా.. అయితే.. అక్కడుండే చిన్నచిన్న సమస్యలు.. అంతోటి పెద్ద పెద్ద ఆస్పత్రుల ప్రతిష్టకు మచ్చను తెచ్చిపెడుతున్నాయి.. వైద్యం కోసం వెళ్తే సామాన్యులకు కష్టాలను ‘కొని’ తెచ్చిపెడుతున్నాయి. ఒకచోట డాక్టర్ బాబు సరిగా రారు.. మరోచోట పరీక్షలు చేసే పరికరాలు పనిచేయవు.. ఇంకోచోట దూదికీ దిక్కులేదు.. కొద్దిపాటి నిధులు కేటాయించి.. కాస్త దృష్టిపెడితే.. సరిదిద్దగలిగే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఎన్నో.. ఈ కొత్త ఏడాదిలో దానిపై దృష్టి పెడితే.. ప్రభుత్వ దవాఖానా ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం.. ఆ సమస్యలు వాటి వివరాలు ఏంటో ఓసారి చూద్దామా.. – సాక్షి, హైదరాబాద్
సూది మందు వేయాలి.. శ్రద్ధ కాస్తపెట్టాలి
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్‌ఐ మిషన్ కూడా పనిచేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్‌ఐ మిషన్ కూడా పని చేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది.
ఉస్మానియాలో పనిచేయని సీటీ స్కాన్
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో రెండు సీటీ స్కాన్లు ఉండగా, ఒకటి మరమ్మతుల్లో ఉంది. ఐసీయూల్లో ఉండే మల్టీ చానల్ మానిటర్లు పనిచేయడంలేదు. సీటీ స్కాన్‌ను మరమ్మతు చేయడానికి రూ.10 వేలు, మల్టీచానల్ మానిటర్ల కోసం రూ.లక్ష వరకు కేటాయిస్తే అవి అందుబాటులోకి వచ్చే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్తవి కొనుగోలు చేసినా రూ. 2 కోట్లు ఖర్చుచేస్తే సరి.
జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద పరీక్షలకు దిక్కేది
రాష్ట్రంలో అనేక జిల్లా ఆసుపత్రుల్లో కీలకమైన సీటీ స్కాన్, అ్రల్టాసౌండ్, 2డీ ఎకో వంటి వైద్య పరికరాలు అందుబాటులో లేవు. దీంతో ఆయా ఆసుపత్రులకు వచ్చే పేదరోగులు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ లేబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కో ఆసుపత్రి రూ.3 కోట్ల మేర ఖర్చు చేసినా వీటిని సమకూర్చుకోవచ్చు.
46 కొత్త ఆసుపత్రులు నిర్మించినా?
రాష్ట్రంలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) నిర్మించారు. వాటిని నిర్మించి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ, చిన్న, చిన్న పనులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఆయా కొత్త ఆసుపత్రులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఒక్కో ఆసుపత్రికి సరాసరి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.2.30 కోట్లు ఖర్చు చేస్తే ఇవి పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి.
మూడు నెలల మందులు వారానికే..
పీహెచ్‌సీ, సీహెచ్‌సీ మొదలు జిల్లాస్థాయి ఆసుపత్రులు, ఆపై ఆసుపత్రుల వరకు చాలా చోట్ల రోగులకు సరిపడా మందులు ఇవ్వడంలేదు. బీపీ, షుగర్, ఆస్తమా, పక్షవాతం, కీళ్ల నొప్పులు తదితర రోగాలకు నిత్యం వాడాల్సిన మందులను వారానికే ఇస్తున్నారు. వారం తర్వాత ఆయా మందులను రోగులు బయట కొంటున్నారు. నెల నుంచి మూడు నెలల వరకు మందులు ఇస్తే ఎటువంటి సమస్యా తలెత్తదు. ఆ మేరకు మందులను సర్దుబాటు చేయాలి. దీనికి బడ్జెట్‌తో సంబంధంలేదు.
ఇలా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ
- పీహెచ్‌సీలు, ఇతర కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. రోజూ డాక్టర్ వస్తారన్న నమ్మకం కల్పిస్తే చాలు రోగులు ఓపీలో చూపించుకుంటారు. దీనికి కావాల్సింది పర్యవేక్షణ
- అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఏళ్లు, నెలల తరబడి మూలనపడి ఉంటున్నాయి. దాదాపు 20 శాతం వరకు మరమ్మతుల్లో ఉన్నాయి. వాటిని మరమ్మతు చేస్తే రోగులకు ఎంతో ప్రయోజనం. అందుకోసం కొన్ని ఆసుపత్రులకు కలిపి టెక్నీíÙయన్లను నియమించుకోవాలి. వాటికయ్యే ఖర్చు అత్యంత స్వల్పం
- అనేక ఆసుపత్రుల ప్రాంగణాల్లో పిచి్చమొక్కలు దర్మనమిస్తున్నాయి. మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో వాటిని తొలగించి ఉద్యాన శాఖ ద్వారా మంచి మొక్కలు పెంచితే ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేషెంట్ కేర్ ప్రొవైడర్లు ఉండాలి. పరీక్షలు ఎక్కడ చేస్తారు? ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారో తెలియజెప్పాలి. రిసెప్షన్ సెంటర్ ఉండాలి. తద్వారా రోగులకు గైడ్ చేయాలి.
- డాక్టర్లు చూసి మందులు రాసి వెళ్తారు. కానీ, రోగికి వచి్చన జబ్బుపై చర్చించి అవసరమైన సలహాలు ఇవ్వరు. ఈ పరిస్థితి మారాలి.
Comments
Please login to add a commentAdd a comment