పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాల తనిఖీ
నిర్లక్ష్య అధికారులపై కొరడా
నిర్దేశిత సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు
మంత్రి రాజనర్సింహ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా పది టాస్‌్కఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బృందాలు క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించి నివేదిక ఇవ్వాలన్నారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన శాఖ ఉన్నాధికారులతో సమావేశం నిర్వహించారు.
టాస్‌్కఫోర్స్ బృందాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల తీరు ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ సాగేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి తేవాలని చెప్పారు.
దీనిపై త్వర లో సెంట్రల్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్న ట్లు పేర్కొన్నారు. ఎక్విప్‌మెంట్ స్థాయిని బట్టి రెండు నుంచి నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
జిల్లాకో బయోమెడికల్ ఇంజనీర్
రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లనునియమించకపోవడంతో చిన్న చిన్న రిపేర్ల కోసమూ ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని అధికారులు రాజనర్సింహకు వివరించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రతీ జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలన్నా రు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మిషన్లను రిపేర్‌లో పెడుతున్నారని అధికారులు వివరించగా... అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారిపై కొర డా ఝుళిపించాలన్నారు.
ఎక్స్‌పైరీ తేదీ కంటే 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేని పక్షంలో వెనక్కి పంపించాలన్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలన్నారు. పలు హాస్పిటల్స్‌లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ సరిగా లేవని గుర్తించామని, నాలుగైదు సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేదని అధికారులు వివరించారు.
ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త వద్దని, ప్రతి హాస్పి టల్‌లో అవసరమైనమేర అలారమ్, స్మోక్ డిటెక్టర్స్, మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచాలని రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment