Gray hounds
-
TS: కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి.. సీఎం రేవంత్ విచారం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభజన పూర్తి: రాజీవ్ త్రివేది
* తెలంగాణ ఆక్టోపస్ ఇన్చార్జిగా అదనపు డీజీ రాజీవ్ త్రివేది * గ్రేహౌండ్స్ ఐజీగా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యాంటీ నక్సలైట్ కమాండో విభాగం గ్రేహౌండ్స్‌తో పాటు రాష్ట్ర యాంటీ టైస్ట్ కమాండో విభాగం ఆక్టోపస్ రెండుగా విడిపోయాయి. తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ ఇన్చార్జిగా రాష్ట్ర స్పెషల్ బెటాలియన్ అదనపు డీజీ రాజీవ్‌త్రివేది గురువారం బాధ్యతలను స్వీకరించారు. అలాగే ఆక్టోపస్ ఐజీగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ మహేష్ మురళీధర్ భగవత్ బాధ్యతలను చేపట్టారు. గ్రేహౌండ్స్‌కు సంబంధించి కీలకమైన కమాండోలను రెండు రాష్ట్రాలకు విభజించారు. తెలంగాణకు కొంత తక్కువగా కేటాయింపు జరిగినా వచ్చే రెండు, మూడు నెలల్లో గ్రేహౌండ్స్‌కు అవసరమైన సిబ్బందిని సమకూర్చుతారని ఉన్నతాధికారులు తెలిపారు.