సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన భారీ దొంగతనం కేసును తెలంగాణ పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారి నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లో జవహర్‌నగర్ కాలనీలోని పీజీ టవర్స్ వ్యాపారవేత్త రాహుల్ గోయల్ నివాసం ఉంటున్నారు. అయితే, 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్‌కు వెళ్లారు. అనంతరం.. 10వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. లాకర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు, రూ. 49 లక్షల నగదు కనిపించలేదు.
రూ.5కోట్ల విలువ..
దీంతో, రాహుల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్బంగా చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు ఐదు కోట్ల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. రాహుల్ ఇంటికి కాపాలాగా ఉన్న కమల్, అతడి కుటుంబ సభ్యులపై ఫోకస్ పెట్టారు. దర్యాప్తు సమయానికి వారు కనిపించకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు.
నేపాలీ గ్యాంగ్..
కాగా, వారంతా నేపాల్‌కు చెందిన వారు కావడంతో పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని, ఆ దిశగా పోలీసలు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ముంబైలో తొమ్మిది మంది నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరిని ముంబైకి చెందిన ఒక ఏజెన్సీ వారిని పనిలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు!
Comments
Please login to add a commentAdd a comment