వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటనపై కేసు | TS Police Registered Case On Child killed In Street Dogs Attack | Sakshi

వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటనపై కేసు

Jun 1 2020 3:03 AM | Updated on Jun 1 2020 3:03 AM

TS Police Registered Case On Child killed In Street Dogs Attack - Sakshi

మేడిపల్లి: వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి సంఘటనలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి చెంగిచర్ల శ్రీనివాసకాలనీకి చెందిన అంగోతు హౌలీ కుమార్తె అంగోతు బేబీ (6) శనివారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటుండగా కాలనీకి చెందిన వీధి కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. కుటుంబసభ్యులు, స్థానికులు గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నగరంలోని నిలోఫర్‌ చిన్నారుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement