Street dogs attack
-
వీధికుక్కల బారి నుంచి కాపాడాలంటూ చిన్నారుల ఆందోళన
-
కుక్కలదాడిలో బాలుడి మృతి
పటాన్చెరు టౌన్: బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల బా లుడిపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన బాల్కన్, ప్రమీల దంపతులు బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు వలస వచ్చారు. వీరికి ము గ్గురు సంతానం.ఇద్దరిని స్వగ్రామంలో ఉంచి చిన్న కుమారుడు బిశాల్ (6)ను తమ వెంట తీసుకొచ్చారు. ఓ వెంచర్ వద్ద మేస్త్రీ కింద భార్యాభర్త లు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా రు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బిశాల్ బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో నాలు గు కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. మెడపై శరీర భాగాలపై తీవ్రంగా గాయాలు కావడంతో బాలుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముత్తంగిలో 8 నెలల పాపపై.. పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తంగిలో ఎనిమిది నెలల పాపపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోకిరం, రోట్న దంపతులు బతుకుదెరువు కోసం ముత్తంగి నాగార్జున కాలనీకి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం భార్యాభర్తలిద్దరూ స్వాతి (8 నెలలు)ని పడుకోబెట్టి పక్కనే పని చేసుకుంటున్నారు. అటుగా వచి్చన కుక్క పాపను కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంత రం చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. -
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?వాటికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా?
జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు. ఆకలితో దాడి చేస్తున్నాయా..? ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు. ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. ►కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. ► నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. ► కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ►కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్క కరిస్తే ఏం చేయాలి? కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. రేబిస్‌తో చాలా ప్రమాదం రేబీస్ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం. పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – అనిల్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
హైద్రాబాద్ లో వీధి కుక్కల బీభత్సం
-
వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలు ఇవీ.. ► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేయాలి. ► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. ► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. ► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. ► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. ► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. ► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. -
కరీంనగర్ జిల్లాలోనూ కుక్కలు స్వైర విహారం
-
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బాలుడిపై గ్రామ సింహం దాడి!
వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. తన మట్టుకు తాను ఆడుకుంటుడగా ఓ బాలుడిపై వీధి కుక్క దాడికి చేసి తీవ్రంగా గాయపరించింది. బాలుడిపై కక్ష గట్టిందా అన్న రేంజ్లో దాడి చేసి గాయపరిచింది. కాగా, ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలోని అరక్కినార్లో సైకిల్ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, బాలుడిపై కక్ష కట్టిందా అన్న రేంజ్లో కుక్కు దాడి చేసింది. ఇక, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ ఆధారంగా దాడి జరిగిన ఘటన బయటకు వచ్చింది. Dogs Own Country? Over 100,000 humans suffered stray dog bites in Kerala in 2022. Record rabies deaths reported. Vaccines didn’t work for many. Millions of harmless birds, pigs, buffaloes, cows are killed daily. Why not dogs? ‘Dog Activists’ also should be punished! pic.twitter.com/OI0gjqKrYe — Porinju Veliyath (@porinju) September 12, 2022 అలాగే, కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో విద్యార్థులు పరిగెత్తుకుని వచ్చి.. ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. కేరళను డాగ్స్ ఓన్ కంట్రీ అని కామెంట్స్ చేస్తున్నారు. #WATCH | Kerala: Students in Kannur manage to escape unharmed as stray dogs chase them in the locality (12.09) pic.twitter.com/HPV27btmix — ANI (@ANI) September 13, 2022 -
చిన్నారులపై కుక్కల దాడి
సాక్షి, రాజేంద్రనగర్: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. 24 గంటల్లో ఐదుగురు చిన్నారులపై దాడి చేశాయి. ఓ బాలుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బండ్లగూడ పద్మశ్రీహిల్స్ కాలనీ ప్రాంతంలో రఘు(7) తన తండ్రి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టీ కొట్టు వద్ద గురువారం సాయంత్రం నిలబడి ఉన్నాడు. బాలుడి తండ్రి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటివద్ద టీలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గుంపుగా వచ్చిన వీధి కుక్కలు రఘుపై దాడి చేశాయి. ఈ దాడిలో రఘు తల, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో రఘును సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం బండ్లగూడలో కూలీ పని చేసేందుకు తండ్రి తో వచ్చిన మరో బాలుడు కార్తీక్(7)పై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి వీపు, చేతులు, చెంపలపై తీవ్ర గాయాలయ్యాయి. 24 గంటల్లో ఐదుగురు చిన్నారులు కుక్కల దాడిలో గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు... బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్నామని నిత్యం 20కి పైగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కమిషనర్‌తో పాటు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటనపై కేసు
మేడిపల్లి: వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి సంఘటనలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచర్ల శ్రీనివాసకాలనీకి చెందిన అంగోతు హౌలీ కుమార్తె అంగోతు బేబీ (6) శనివారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటుండగా కాలనీకి చెందిన వీధి కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. కుటుంబసభ్యులు, స్థానికులు గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నగరంలోని నిలోఫర్ చిన్నారుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్ : వీధికుక్కల వీరంగానికి ఓ ఆరేళ్ల చిన్నారి విలవిల్లాడింది. సకాలంలో తగిన వైద్యం అందక ఆరు గంటలపాటు నరకయాతన అనుభవించింది. పాపను బతికిం చుకునేందుకు పేదింటి తల్లిదండ్రులు ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరి గినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం, ఉదాసీనత వల్ల చివరకు తుదిశ్వాస విడిచింది. ‘అమ్మానాన్న.. భయమైతంది’అంటూతమ కుమార్తె పలికిన చివరి పలుకులు తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కావడం అం దరినీ కలచివేసింది. హైదరాబాద్‌లో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అమ్మచేతి గోరుముద్ద తిని... మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు కారంపూడి తండాకు చెందిన అంగోత్ హోలీ నాయక్ తన భార్య కవిత, కుమార్తె అంగోత్ బేబి, కుమారుడు గణేశ్లతో కలసి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి నగర శివార్లలోని చెంగిచెర్లలో ఉన్న సుశీల టౌన్షిప్లో నివాసముంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు దినసరి కూలీగా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడు. పది నెలల క్రితం నుంచి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారు ఉంటున్న కాలనీకి ఆనుకొని ఒకవైపు అడవి, మరోవైపు యాటల మండీ (జంతు వధశాల) ఉన్నాయి. రోజులాగే నాయక్ శని వారం ఆటో తీసుకొని బయటకు వెళ్లాడు. భార్య కవిత ఉద యం 10 గంటలకు కుమార్తె అం గోత్ బేబికి గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత బట్టలు ఉతుకుతుండగా అమూల్తా వచ్చి అమ్మా టాయ్‌లెట్ వస్తోందని చెప్పడంతో బాత్రూమ్కు వెళ్లమని చెప్పింది. అయితే అంగోత్ బేబి ఇంటి ముందు ఉన్న రోడ్డుపైకి వెళ్లడాన్ని తల్లి గమనించలేదు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన ఐదు వీధికుక్కలు పాపపై దాడి చేశాయి. నిస్సహాయంగా ఉన్న ఆ పాపను ఒళ్లంతా పట్టి పీకాయి. ఇంటి బయట కుక్కల అరుపులు, కుమార్తె ఆర్తనాదాలు వినిపించడంతో బయటకు వెళ్లి తల్లి చూడగా అంగోత్ బేబిని కుక్కలు పట్టుకొని ఇంకా కరుస్తుండటం చూసింది. వెంటనే అక్కడున్న కర్రలు, రాళ్లతో కుక్కలను చెదరగొట్టిన కవిత... భర్తకు విషయం తెలపడంతోపాటు అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అప్పటికే పాప శరీరమంతా రక్తసిక్తమైంది. ఆరు గంటలపాటు తల్లడిల్లి... శనివారం ఉదయం 10.30 గంటలకు కుక్కలు దాడి చేయగా 11.00 గంటల సమయంలో తల్లిదండ్రులు అమూల్తాను ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి యాజమాన్యం ఫీజు వసూలు చేసి రెండు గంటలపాటు చికిత్స చేసింది. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. సమీపంలోని అంకుర ఆస్పత్రికి తరలించాలని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో చేసేది లేక మరో అంబులెన్సులో తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను దాదాపు మూడు గంటలపాటు పరీక్షించిన వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో మరో అంబులెన్సులో సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు ఆ చిన్నారికి చికిత్స చేయబోమని తెగేసి చెప్పడంతో ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసే సమయంలో నీళ్లు తాగిన పాప తనకు భయంగా ఉందంటూ తల్లిదండ్రులతో చివరగా మాట్లాడింది. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో పాపను నిలోఫర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సాయంత్రం 4:15 గంటలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిలోఫర్‌లో దాదాపు గంటపాటు చికిత్స పొందిన అమూల్తా చివరకు కన్నుమూసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తమ బిడ్డను ఎవరూ కాపాడలేకపోయారంటూ కన్నీరుమున్నీరయ్యారు. అమూల్తా అంటే తమకు ఎంతో ప్రాణమని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ‘సాక్షి’తో మాట్లాడుతూ తల్లిడిల్లారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం అంత్యక్రియల కోసం స్వస్థలానికి వెళ్లింది. -
చిన్నరిపై దాడి చేసిన వీధి కుక్కలు
-
తిరుపతిలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు
-
పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి మృతి
-
పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి మృతి
కరీంనగర్: పిచ్చి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో చోటు చేసుకుంది. శ్రావణి (6) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో జున్ 22వ తేదీన పాఠశాలకు వెళ్తున్న శ్రావణిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో శ్రావణిని హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి శనివారం మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిచ్చికుక్కలను గ్రామం నుంచి తరిమివేయాలని పలుమార్లు గ్రామ పంచాయతి అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. -
వీధికుక్కల దాడిలో విద్యార్థినులకు గాయాలు
హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్కాలనీలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన విద్యార్థినులు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కల ను తరిమికొట్టి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. -
వీధి కుక్కల దాడిలో బాలిక మృతి
వల్సాద్ (గుజరాత్): వీధి కుక్కల దాడిలో మరో బాలిక మృతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఈ ఘోర ఘటన జరిగింది. శుక్రవారం వల్సాద్ జిల్లా కరాదివా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కెన్నీ పటేల్ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై ఎనిమిది నుంచి తొమ్మిది కుక్కలు దాడి చేశాయి. ఈ దాడితో భయకంపితురాలైన ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తర్వాత గ్రామస్థులు ఆమెను కుక్కల దాడి నుంచి కాపాడి తొలుత స్థానిక పీహెచ్సీ, అక్కడి నుంచి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికితరలించారు. అయితే ఆ రెండు చోట్ల యాంటీ రాబిస్ ఇంజక్షన్ లేకపోవడంతో ఆమెను వల్సాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలిక ఒంటిపై 20పైగా తీవ్రంగా కాట్లు ఉన్నాయని, ఆమెను తీసుకురావడంలో ఆలస్యం జరగడంతో కాపాడలేకపోయామని డాక్టర్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న బాలిక తల్లి మరుగుదొడ్డి కట్టుకోవడానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికీ అది పెండింగ్‌లో ఉండటం శోచనీయమని స్థానికులు పేర్కొన్నారు. -
వీధికుక్క దాడిలో బాలునికి తీవ్రగాయాలు
నల్లకుంట(హైదరాబాద్): ఆడుకుంటున్న బాలునిపై వీధి కుక్క దాడి చేసి ముఖం, చేతులపై కరిచి గాయపర్చింది. వివరాలివీ... మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం. నర్సింహ కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి మల్లాపురం అశోక్‌నగర్‌లో ఉంటోంది. కాగా, గురువారం ఉదయం నర్సింహ, అతని భార్య కూలి పనికి వెళ్లగా వారి కుమారుడు ఎం.నవీన్(6) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క అతని ముఖం, కుడి చేతిపై కరిచి గాయపర్చింది. క్షతగాత్రుడిని ఫివర్ ఆస్పత్రికి తరలించారు.