నల్లకుంట(హైదరాబాద్): ఆడుకుంటున్న బాలునిపై వీధి కుక్క దాడి చేసి ముఖం, చేతులపై కరిచి గాయపర్చింది. వివరాలివీ... మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం. నర్సింహ కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి మల్లాపురం అశోక్‌నగర్‌లో ఉంటోంది. కాగా, గురువారం ఉదయం నర్సింహ, అతని భార్య కూలి పనికి వెళ్లగా వారి కుమారుడు ఎం.నవీన్(6) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క అతని ముఖం, కుడి చేతిపై కరిచి గాయపర్చింది. క్షతగాత్రుడిని ఫివర్ ఆస్పత్రికి తరలించారు.