ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్‌కాలనీలో బుధవారం వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్‌కాలనీలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
స్థానిక కాలనీకి చెందిన విద్యార్థినులు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కల ను తరిమికొట్టి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు.