సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఘటన
పటాన్‌చెరు టౌన్: బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల బా లుడిపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన బాల్కన్, ప్రమీల దంపతులు బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు వలస వచ్చారు. వీరికి ము గ్గురు సంతానం.
ఇద్దరిని స్వగ్రామంలో ఉంచి చిన్న కుమారుడు బిశాల్ (6)ను తమ వెంట తీసుకొచ్చారు. ఓ వెంచర్ వద్ద మేస్త్రీ కింద భార్యాభర్త లు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా రు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బిశాల్ బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో నాలు గు కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. మెడపై శరీర భాగాలపై తీవ్రంగా గాయాలు కావడంతో బాలుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముత్తంగిలో 8 నెలల పాపపై..
పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తంగిలో ఎనిమిది నెలల పాపపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోకిరం, రోట్న దంపతులు బతుకుదెరువు కోసం ముత్తంగి నాగార్జున కాలనీకి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం భార్యాభర్తలిద్దరూ స్వాతి (8 నెలలు)ని పడుకోబెట్టి పక్కనే పని చేసుకుంటున్నారు. అటుగా వచి్చన కుక్క పాపను కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంత రం చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment