క్రూరమైన చైనా ఇంటరాగేషన్ | Use of torture for forced confessions still rampant in China | Sakshi
Sakshi News home page

క్రూరమైన చైనా ఇంటరాగేషన్

Published Thu, Nov 12 2015 7:48 PM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

క్రూరమైన చైనా ఇంటరాగేషన్ - Sakshi

క్రూరమైన చైనా ఇంటరాగేషన్

నిందితుల చేత నేరాన్ని ఒప్పించడానికి ఇంటరాగేషన్లో చైనా ఇప్పటికీ మధ్యయుగాల నాటి కాలంలో వాడిన మొరటైన పద్ధతులనే ఉపయోగిస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా చైనాలో నిర్వహిస్తున్న ఇంటరాగేషన్ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల కార్యకర్తలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

దేశ వ్యాప్తంగా పలువురు లాయర్లను ఇంటర్వ్యూ చేసి, పలు కేసుల్లో కోర్టు తీర్పులను వెల్లడించిన తీరును పరిశీలించిన తరువాత ఆమ్నెస్టీ సంస్థ ఈ నివేదికను తయారుచేసింది. దీనిలో చైనాలో ఇంటరాగేషన్ సందర్భంగా పోలీసులు, అధికారులు వ్యవహరించే తీరుపై విస్తుగొలిపే వివరాలను వెల్లడించింది.


నిందితులను నిర్బంధించడం, ఇంటరాగేషన్ విధానంలో అధికారుల ప్రవర్తనపై చైనాకు చెందిన మాజీ లాయర్ తంగ్ జితియాన్ ఆమ్నెస్టీతో పంచుకున్న వివరాలను వెల్లడించారు. ఓ కేసులో ఇంటరాగేషన్ సందర్భంగా తనను ఇనుప కుర్చీలకు బంధించి, మొహంపై బాటిల్తో మొదడం లాంటి క్రూరమైన చర్యలకు పాల్పడినట్లు జితియాన్ వెల్లడించారు. ఒక లాయర్కే ఇలాంటి క్రూరమైన ఇంటరాగేషన్ తప్పలేదంటే ఇక సామాన్య పౌరుల విషయంలో ఎలాంటి సానుకూలతను ఊహిచలేమని నివేదిక వెల్లడించింది. నిందితులకు అహారం అందించకుండా ఉండటం, నిద్రకు దూరం చేయడంలాంటి విధానలు చైనా ఇంటరాగేషన్లో ఓ భాగమయ్యాయని ఆమ్నెస్టీ వెల్లడించింది.

నిందితులను ఇంటరాగేషన్ చేసే సమయంలో క్రూరమైన పద్ధతులు నిషేధించాలని గతంలో ఐక్యరాజ్యసమితి చైనాకు సూచించింది. ఈ మేరకు చైనా తన చట్టంలో మార్పుల చేపట్టినప్పటికీ అమలులో మాత్రం విజయవంతం కాలేదని ఆమ్నెస్టీ ప్రకటించింది. వచ్చే వారం జెనీవాలో చైనా టార్చర్ విధానంపై సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నివేధిక వెల్లడైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement