అనంతపురం: ఈనెల రెండో వారంలో పెనుకొండ వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనపై జిల్లా జడ్జి వెంకటేశ్వర రావు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ, రోడ్లు భవనాలు, రవాణా తదితర శాఖల నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో హైకోర్టుకు అందిస్తామని జడ్జి వెంకటేశ్వర రావు తెలిపారు.