సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్‌ఆర్‌ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పందగా మారింది.నలుగురు రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా గత నెల 30న ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిని అదే రోజు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు.
నాలుగో తేదీ వరకు భువనగిరి జైళ్లో ఉంచిన పోలీసులు.. రాజకీయ నేతల పర్యటనలు, ఇతర కారణాలతో రాయగిరి రైతులను నల్గొండ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితులు పిటిషన్‌లు దాఖలు చేయగా.. నలుగురికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే క్రమంలో 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి వారిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్ మంజూరు అయినందున కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకు రానున్నారు రైతులు.
చదవండి: రంగంలోకి డీకే శివకుమార్.. ట్రబుల్ షూటర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
Comments
Please login to add a commentAdd a comment