'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు' | chandrababu Naidu Political opportunist, says minister Balaraju | Sakshi
Sakshi News home page

'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు'

Published Wed, Jan 22 2014 5:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు'

'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు'

హైదరాబాద్: విభజన విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడిఉన్నానని రాష్ట్ర మంత్రి బాలరాజు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించేముందు సీమాంధ్రులకు ఏం కావాలో అడిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్న చంద్రబాబుది రాజకీయ కాంక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు.

తాము రెండు రాష్ట్రాలకూ సుముఖంగా ఉన్నామని చంద్రబాబు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన ప్రకటన వెలువడగానే కొత్త రాష్ట్రానికి చంద్రబాబు రూ. 5 లక్షల కోట్లు అడిగారంటే ఆయన విభజనకు అంగీకరించినట్టు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగుతున్న న్యాయం ఏంటో చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement