9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత | Tension prevailed at andhra pradesh assembly media point | Sakshi
Sakshi News home page

9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత

Published Mon, Dec 16 2013 11:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత

9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత

హైదరాబాద్: గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఈ ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు చోటు చేసుకున్న సంఘటనల వరుస క్రమమిది.

* ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
* సభ ప్రారంభంకాగానే ఇరు ప్రాంతాల సభ్యుల నినాదాలు
* స్పీకర్ పోడియం వద్ద సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన
* సభను గంట పాటు వాయిదా వేసిన స్పీకర్
* 10 గంటలకు తిరిగి సమావేశమయిన అసెంబ్లీ
* గందరగోళం నడుమ విభజనను బిల్లును సభలో ప్రవేశపెట్టిన స్పీకర్
* బిల్లును శాసనసభ వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడించిన స్పీకర్
* బిల్లును చదివి వినింపించిన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం
* తర్వాత సభను అర గంట వాయిదా వేసిన స్పీకర్
* బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభలో లేని సీఎం, చంద్రబాబు
* సభ వెలుపల మీడియా పాయింట్ వద్ద ఉద్రికత్త
* బిల్లు ప్రతులను చించేసిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ
* ఉమను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నం
* బిల్లు ప్రతులను తగులబెట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
* వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పోలీసుల సాక్షిగా టీఆర్ఎస్ నేతల దాడి
* మీడియా పాయింట్ వద్ద ఆందోళన కొనసాగించిన వైఎస్సార్ సీపీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement