అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం భేటీ కానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో.. ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమావేశాల్లో విపక్షాలు ఏ డిమాండ్లు చేస్తాయి, ఏ ప్రశ్నలు సంధిస్తాయన్న అంశాలపై దృష్టి పెట్టడం కంటే.. రెండున్నరేళ్ల స్వల్ప సమయంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేశామో చెప్పుకోవడానికే ప్రాధాన్యమివ్వాలన్న వ్యూహంతో అధికార పార్టీ ఉందని నేతలు చెబుతున్నారు.
Published Thu, Dec 15 2016 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement