బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనల మధ్యే బిల్లులకు ఆమోదం | Telangana Assembly live updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనల మధ్యే బిల్లులకు ఆమోదం

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

  • తెలంగాణ  అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
  • స్పోర్ట్స్‌ పాలసీ, జీఎస్‌టీ సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం
  • లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్‌ఎస్‌ పట్టు
  • అరెస్ట్‌ చేసిన లగచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్‌
  • రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుబట్టిన బీఆర్‌ఎస్‌
2024-12-17 15:56:58

చర్చ లేకుండానే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

  • స్పోర్ట్స్‌ పాలసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • తెలంగాణ యూనివర్శిటీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • చర్చ లేకుండానే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
  • లగచర్ల ఘటనపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఆందోళన
  • బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనల మధ్యే బిల్లులకు ఆమోదం
     
2024-12-17 15:26:48

గత ప్రభుత్వ జిల్లాల విభజనలో గందరగోళం: మంత్రి పొంగులేటి

  • గత ప్రభుత్వ జిల్లాల విభజన గందరగోళంగా ఉంది
  • ఒక నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉంది
  • రెవెన్యూ డివిజన్‌లలో సిబ్బందే లేరు
  • గత ప్రభుత్వం ఎందుకిలా చేసిందో తెలియదు
  • గత ప్రభుత్వ పొరపాట్లను సరిచేస్తాం.. అవసరమైన చోట సిబ్బందిని నియమిస్తాం
2024-12-17 12:06:45

రాయదుర్గం భూమిని తాకట్టు పెట్టడం బాధాకరం: మహేశ్వర్‌రెడ్డి

  • రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిధి దాటి లక్ష 27 వేల కోట్ల అప్పు తీసుకుంది
  • రాయదుర్గం భూమిని ప్రవేటు వారికి తాకట్టు పెట్టాలని అనుకోవడం బాధాకరం
  • ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామని చెప్పారు.. ఎందుకు చట్ట బద్దత కల్పించలేదు
2024-12-17 11:16:23

ఏడాదిలో లక్షా 27 వేల కోట్ల అప్పు చేశారు: హరీశ్‌రావు

  • భట్టి రాజకీయ ఉపన్యాసం చేస్తుంటే మీరేం మాట్లాడరు
  • వికారాబాద్‌ ప్రజల హక్కులను స్పీకర్‌ కాపాడాలి
  • సభ తీరును రాష్ట్ర, దేశ ప్రజలంతా చూస్తున్నారు
  • బిల్లులు బీఏసీలో చర్చించకుండా పెట్టారని రూల్‌బుక్‌ చూసి మాట్లాడాను
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం 1లక్షా27వేల కోట్ల రూపాయల అప్పు చేసింది
  • వ్యవసాయ కూలీలకు ఇచ్చినందుకు కాదు.. సభలో కాకుండా బయట స్కీమ్‌ ‍ప్రకటించినందుకు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చాం
     
2024-12-17 10:45:13

హరీశ్‌రావుకు నిజాలు మాట్లాడే అలవాటు లేదు: భట్టి విక్రమార్క

  • దళితులకు 3 ఎకరాల భూమి బీఆర్‌ఎస్‌ ఇచ్చిందా
  • రైతు కూలీలకు 12 వేలు ఇస్తే  ప్రివిలేజ్‌ మోషనా
  • ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీఆర్‌ఎస్‌కు మతి పోతోంది
  • అప్పులు ఆర్బీఐ నుంచి ఓపెన్‌గా తీసుకుంటున్నాం
  • సభను హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారు
  • హరీశ్‌రావుకు నిజాలు మాట్లాడే అలవాటు లేదు
  • అప్పులపై చర్చకు మేం రెడీ.. హరీశ్‌రావు సవాల్‌ స్వీకరిస్తున్నా
2024-12-17 10:34:45

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ నిరసన

 నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
రైతులకు బేడీలా అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నినాదాలు
లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

2024-12-17 10:04:05

బలవంతపు భూసేకరణపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

  • పరిశ్రమల కోసం బలవంతపు భూసేకరణపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం
  • వాయిదా తీర్మానాన్నిస్పీకర్‌ తిరస్కరించే ఛాన్స్‌ 
  • కొత్త టూరిజం పాలసీపై చర్చ జరిగే అవకాశం 
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
2024-12-17 09:34:18

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..వాడివేడిగా సాగే ఛాన్స్‌

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభమవనున్నాయి
  • ప్రభుత్వం టూరిజం పాలసీపై చర్చకు ప్రతిపాదించింది
  • బీఆర్‌ఎస్‌ లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు పట్టబడుతోంది
  • ఈ నేపథ్యంలో సమావేశాలు నేడు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది
2024-12-17 07:08:11
Advertisement
 
Advertisement
 
Advertisement