
చిన్నారికి నామకరణం చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చిత్తూరు అర్బన్: అమ్మఒడి కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తతన తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ చిన్నారికి నామకరణం చేశారు. 20 రోజుల చిన్నారికి పేరు పెట్టాలని ఓ తల్లి కోరగా.. పాపను తీసుకుని లాలించిన వైఎస్.జగన్ పాపకు విజయలక్ష్మిగా పేరు పెట్టారు. చిత్తూరు నగరానికి చెందిన 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఇందు ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది. ఈమెను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్టేజిపైకి తీసుకొచ్చి ‘అన్న ఈమె ఇందు, గతంలో మన పార్టీలో చేరారు. సురేష్ అన్న తీసుకొచ్చారు. మాజీ కార్పొరేటర్’ అని సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పరిచయం చేశారు. ‘అవును గుర్తుంది. బాగున్నావా తల్లీ’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తన పాపకు పేరు పెట్టాలని ఇందు, సీఎంను కోరారు. పాపను చేతుల్లోకి తీసుకుని సీఎం.. విజయలక్ష్మి అంటూ పేరు పెట్టి తల్లీబిడ్డను దీవించారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment