గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో చేసి చూపుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన జగ్గయ్యపేట పురపాలక సంస్థ పరిధిలోని 24,25,26,27 డివిజన్ల వార్డు సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీలకు సచివాలయాల వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు టీడీపీ సభ్యుల కోసం పనిచేశాయని ఆరోపించారు. కానీ మతం, కులం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికి అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.