
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ ఆయన అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు పయనం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్ధేశించి మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు.