చదువుకు ఊపిరి.. అమ్మ ఒడి | Jagananna Ammavodi Can End Child Labour | Sakshi
Sakshi News home page

చదువుకు ఊపిరి.. అమ్మ ఒడి

Published Mon, Apr 1 2024 5:15 PM | Last Updated on Mon, Apr 1 2024 5:15 PM

Jagananna Ammavodi Can End Child Labour

జగనన్న అమ్మ ఒడి పేద విద్యార్థులకు వరం

మదనపల్లె సిటీ: ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థీ చదువుకు దూరం కారాదు. పనికి పంపే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బడికి పంపాలి. అందుకే సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. నాడు–నేడు పథకంలో ఓ పక్కన స్కూళ్లను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ది చేస్తూనే, బడిబయట పిల్లలు కూడా బడిలో చేరేలా అమ్మ ఒడి పథకాన్ని పైసా అవినీతికి అస్కారం లేకుండా అమలు చేశారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యావిప్లవం. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వై.ఎస్‌.జగనమోహన్‌రెడ్డి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని దేశమంతా ప్రశంసించింది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ విద్య అందితే, రాష్ట్ర భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందని నమ్మిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆ దిశగా అవసరమైన ప్రతి చర్యనూ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమైన వారంతా అమ్మ ఒడి ఉందనే ధీమాతో బడిబాట పడుతున్నారు. ఇందుకు 2019 నుంచి 2023 వరకు ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం.

అర్హతే ప్రామాణికం
విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించాలనే ఉన్నతాశయంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నప్పటికీ అమ్మఒడి మంజూరు చేస్తున్నారు. పథకం పారదర్శకంగా అమలు చేసే క్రమంలో సచివాలయం స్థాయిలో లబ్ధిదారుల బయోమెట్రిక్‌ ఆథంటికేషన్‌ (ఈకైవెసీ)తో ఆధార్‌కార్డు అనుసంధానించిన బ్యాంక్‌ ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నారు. మధ్యవర్తుల బెడద, పైసా అవినీతి లేకుండా, నేరుగా లబ్దిదారులకు డబ్బులు అందుతున్నాయి.

ఒక్కో విద్యార్థికి రూ.60 వేలు లబ్ధి
ఏటా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్జులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రతి విద్యార్థికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మొత్తంగా రూ.60 వేలు లబ్ధి చేకూరుతుంది. ముందస్తు షెడ్యూలు మేరకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.15 వేలు ఈ వేసవి సెలవుల అనంతరం బడి తెరిచిన మొదటి రోజునే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏటా క్రమం తప్పకుండా అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

విద్యాకానుకతో ధీమా
జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ యాజమాన్యాల పరిఽధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్‌బ్యాగ్‌, నోట్‌ పుస్తకాలు,షూస్‌, సాక్స్‌, మూడు జతల యూనిఫాం( కుట్టుకూలీతో సహా) ఇలా తొమ్మిది రకాల వస్తువులను ఇస్తున్నారు. ఒక్కో కిట్‌ విలువ రూ.1,964.

నా పేరు భువనేశ్వరి. నా భర్త హరి హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు దేవాన్ష్‌ మూడో తరగతి చదువుతున్నాడు. పాప ఇంటి వద్ద ఉంది. బాబుకు అమ్మ ఒడి కింద రూ.15 వేలు వచ్చింది. పాఠశాలలో బాబుకు జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు,యూనిఫాం ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యామని బాబును బాగా చదివిస్తున్నాం.
 

నా పేరు కె.పల్లవి. మాది సామాన్య కుటుంబం. ఇద్దరు పిల్లలు. పెద్ద పాప భావన 8వ తరగతి, చిన్నపాప ప్రేరణ 5వ తరగతి చదువుతున్నారు. వారిని ప్రైవేటు బడుల్లో చదివించే స్థోమత లేదు.ఇద్దరిని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నా. గతంలో పుస్తకాలు,బ్యాగులకు రూ.8 వేల వరకు ఖర్చు వచ్చేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి కింద రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు,యూనిఫాం అన్ని ఉచితంగా ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడిలో మంచి బోధన ఉంది. పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకున్నందున మాకు చాలా సంతోషంగా ఉంది.

అమ్మ ఒడి వల్లే మా పాప చదువు
మాది పేద కుటుంబం. నాకు ఇద్దకు పిల్లలు. పిల్లలను చదవించుకోవాలంటే కష్టంగా ఉండేది. పాఠశాల తెరిచే రోజుకు బట్టలు, పుస్తకాలు కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయిన వెంటనే మా బిడ్డ సనకు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి. స్థానిక ఉర్దూ మున్సిపల్‌ పాఠశాలలో చదువుతోంది. పాఠశాలలో జగనన్న విద్యాకానుక కింద పుస్తకాలు, దుస్తులు ఇచ్చారు. సీఎంకు రుణపడిఉంటాం.
– షహరాభాను, బాపనకాలువ, మదనపల్లె

జగనన్న మేలు మరువలేం
నా పేరు శిరిషా, నా భర్త వెంకటరమణారెడ్డి. ఓ బేకరీ షాపులో పని చేస్తున్నాడు. నాకు జ్ఞానప్రకాష్‌, రోహిత్‌కుమార్‌ ఇద్దరు పిల్లలు. పిల్లలను చదివించాలంటే కష్టంగా ఉండేది. పుస్తకాలు, యూనిఫాం కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయ్యాక మా బిడ్డకు అమ్మ ఒడి కింద డబ్బు వస్తున్నాయి. జగనన్న మేలు మరవలేము.
– శిరిషా, బీటీ కాలేజీ రోడ్డు, మదనపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement