
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన తల్లులే అత్యధికంగా ఉన్నారు. జనాభాలో ఎక్కువ శాతం బీసీ వర్గాలే. అందుకు అనుగుణంగానే అమ్మ ఒడి లబ్ధిదారులు కూడా ఉన్నారు. కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో బీసీల తర్వాత ఎక్కువగా ఓసీల్లోని పేద వర్గాలు అమ్మ ఒడి లబ్ధిదారులుగా ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో బీసీలు 23.48 లక్షల మంది ఉండగా.. 9.29 లక్షల మంది ఓసీలు ఉన్నారు. 8.84 లక్షల మంది ఎస్సీలు, 2.86 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment