సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుర్తుచేశారు. వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోజనాలు కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని ఉపయోగించాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువయ్యేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం తలెత్తుకునేలా చేశారని అన్నారు.
గతంలో ఎందరో ముఖ్యమంత్రుల వచ్చారు.. వెళ్లారు.. కానీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ప్రీ కరెంట్ వంటి పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదే బాటలో ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తృతం చేయడమే కాకుండా.. చికిత్స తర్వాత కూడా విశ్రాంతి తీసుకుంటున్నవారికి భృతి కల్పిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాడానికి సంకల్పించారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్నా భోజనం అందుతుదని పేర్కొన్నారు.
ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చింది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడితో నిజమైన రాష్ట్ర ప్రజలకు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ విద్యా దీవెన, విద్యా వసతితో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా మారాయని చెప్పారు. భావితరాలకు అమ్మ ఒడి పథకం ఎంతో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి:
చంద్రబాబుకు ఎమ్మెల్యే రజనీ చురకలు
‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’
Comments
Please login to add a commentAdd a comment