నాలుగున్నరేళ్లుగా దాదాపు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్ల జీవితాలతో చెలగాటమాడుతూ సంస్థకు చెందిన విలువైన భూములను కాజేసే ఎత్తుగడతో కాలక్షేపం చేసిన టీడీపీ సర్కారు ఎన్నికల ముందు మరో మోసానికి సిద్ధమైంది. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఖ్య డేటాతో సరిపోలడం లేదంటూ బాధితుల ఏరివేత చర్యలకు పాల్పడుతోంది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులందరికీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని, వారికి రూ.1,182 కోట్లను చెల్లిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షనేత చేసిన ప్రజాసంకల్ప పాదయాత్రలో పలుచోట్ల అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు.