
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తోన్న బాధితులును ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అగ్రిగోల్డ్ బాధితులను అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ర్యాలీకి అనుమతి లేదని అగ్రిగోల్డ్ బాధితులకు పోలీసులు తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలంటూ ధర్నాచౌక్‌లో 30 గంటల ధర్మాగ్రహ దీక్షకు బాధితులు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. పోలీసులను ప్రయోగించి తమను అరెస్ట్ చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే తమను అరెస్ట్ చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment