అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని తెలిపారు. గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది.