గుంటూరు: ఈ నెల 29 నుంచి అగ్రిగోల్డ్ బాసట కమిటీ ప్రాంతీయ సమావేశాలు జరుగుతాయని వైఎస్సార్‌సీపీ నేత, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లేళ్ల అప్పి రెడ్డి తెలిపారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 29న విశాఖపట్నంలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల వారితోనూ, 30న విజయవాడ నగరంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా వారితోనూ, 31న నెల్లూరులో ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారితోనూ, జనవరి 2న అనంతపురంలో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల వారితో సమావేశమవుతున్నట్లు వెల్లడించారు.
అగ్రిగోల్డ్ బాసట కమిటీ నేతలు, వైఎస్సాసీపీ సమన్వయకర్తలు అందరూ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచి బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని వ్యాక్యానించారు.
29 నుంచి అగ్రిగోల్డ్ బాసట కమిటీ సమావేశాలు
Published Wed, Dec 26 2018 7:23 PM | Last Updated on Wed, Dec 26 2018 7:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment