సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఏపీ డీజీపీ సాంబశివ రావు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ప్రతి మండలంలోనూ సీఐడీ ఆధ్వర్యంలో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రీగోల్డ్ బాధితులు వున్నారని వివరించారు. అలాగే ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వారు 9.9 లక్షల మంది వున్నారని తెలియజేశారు.
ప్రతి తహసీల్దారు కార్యాలయంలో సీఐడీ కౌంటర్ల వివరాలు, వెరిఫికేషన్ షెడ్యూల్ ను అందుబాటులో వుంచుతామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు వారి వద్ద వున్న ఒరిజినల్ పత్రాలను సీఐడీ వద్ద వెరిఫై చేయించుకోవాలన్నారు. వివిధ కారణాల వల్ల సీఐడీ కేంద్రాలకు రాలేకపోయిన వారికి మళ్లీ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment