
విజయవాడ : రాష్ట్రంలో రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ఆ వైద్యం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన ఆదివారమిక‍్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లను హైకోర్టు సమక్షంలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలకు 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు అడుగులు వేస్తున్నామని అయన పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ వాలంటరీల నియమాక ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల రోజుల పాలన సాగిందని.. అమ్మఒడి , రైతు భరోసా, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు వంటి గొప్ప నిర్ణయాలు ఈ నెలలోనే తీసుకున్నారని తెలిపారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉందని.. దాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment