
సాక్షి, అమరావతి: ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 3.7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో బాధితులు ఉన్నా ఆదుకున్నది తమ ప్రభుత్వం మాత్రమే అని సీఎం తెలిపారు. దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే ఇది సాధ్యంఅయ్యిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని తెలిపారు.
చదవండి: ‘మాట నిలబెట్టుకుని.. మీ ముందు నిలబడ్డా’