ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు రూ.264,99,00,983 విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
బాధితులకు అండగా..
Published Sat, Oct 19 2019 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement