
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులుకు రూ.250 కోట్లు ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోందని.. ఆ డబ్బు ఎవరికి ఇచ్చిందో చెప్పాలని, చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు సేకరించిన బాధితుల డేటా ఏమైందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ కంపెనీకి ఎన్ని సిస్టర్ కంపెనీలు ఉన్నాయో అన్నింటిని విచారించాలని కోరారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ తప్పించుకు తిరిగితే.. సీఎం చంద్రబాబు సిగ్గుమాలిన స్టేట్‌మెంట్లు ఇస్తారని, అవ్వాస్ రామారావును పట్టిస్తే.. నజరానా అని చెప్పడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ ఇచ్చి పంపించారన్నారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యం, ప్రభుత్వం నిర్వాకానికి 8 రాష్ట్రాల్లో 32లక్షల మంది 6,800కోట్లు, ఏపీలో 19.52లక్షల మంది రూ. 3960కోట్ల ధనం మోసపోయారన్నారు. 2014లో చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని కానీ ఆయన అగ్రి బాధితులను పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్ రెడ్డి మా తరుపున గళమెత్తారన్నారు. ప్రభుత్వం కేసును జాప్యం చేస్తూ వచ్చిందన్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటికీ న్యాయం జరగలేదని అసెంబ్లీ సాక్షిగా 20వేల లోపు ఉన్న బాధితులు 13లక్షల మంది ఉన్నామని వాళ్లకు నాలుగు నెలలలోపు సహాయం చేస్తామని చెప్పి బాబు మోసం చేశారన్నారు. జీవో 724తో చనిపోయిన వాళ్లకు న్యాయం చేస్తామన్నారని కానీ ఆ జీవో కోసం కూడా పోరాడాల్సివచ్చిందన్నారు. జగన్ పోరాడితే 5 లక్షల ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ఒప్పుకుందని, అది కూడా స్వల్ప మందికే అందిందని వాపోయారు. నిరాహార దీక్ష చేస్తే కేసులు పెట్టి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేత సహాయం అందిస్తామని ప్రకంటిచారు కానీ న్యాయం దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment